Ancient iron locker found during old house demolition in kurnool
Andhra Pradesh : రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కరివేముల గ్రామంలో పురాతనకాలంనాటి బీరువా ఒకటి బయటపడింది. నర్శింహులు అనే వ్యక్తి ఇంటి స్థలం క్లిన్ చేస్తుండగా బయటపడిన పురాతన కాలం నాటి బీరువా బయటపడింది. ఈ బీరువాపై లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంది. అచ్చంలాకర్ లా ఉన్న ఈ బీరువా తవ్వకాల్లో బయటపడిందని తెలియటంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనాలు వచ్చి ఈ బీరువాను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ బీరువాలో ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ బీరువా తన స్థలంలోనే లభ్యం కావటంతో నర్శింహులు దాంట్లో ఏమున్నా తనకే దక్కుతుందని ఆశపడుతున్నాడు. బీరువా బయటపడిన విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
నరసింహులు ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ బీరువా బయటపడిన స్థలాన్ని కొన్నాడు.ఆ స్థలంలో పాతకాలంనాటి ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూల్చి కొత్తగా ఇల్లు కట్టుకోవటానికి స్థలం క్లీన్ చేస్తుండగా ఈ బీరువా బయటపడింది. అచ్చం నేటి లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటం ఇంగ్లీష్ లో వాక్యాలు రాసున్నాయి. ఈ ఇనుప పెట్టె ఇంచుకూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చి, తెరిచేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. కానీ ఫలితం లేదు.
ఈ బీరువు పురాతన కాలంనాటిది కావటం పైగా అది రతనాల సీమగా పేరున్న రాయలసీమలోని గ్రామంలో బయటపడటంతో దీంట్లో బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని పదిమందికలిసినా కదపలేకపోవటంవతో జేసీబీతో దీన్ని బయటకు తెచ్చి..ట్రాక్టర్ పై తరలించారు. ఈ బీరువాను చూడటానికి జనాలు ఎగబడుతున్నారు. దాంట్లో ఏముందో తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ బీరువా విషయంపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఏముందో తెలుస్తుంది.
కాగా..అది తన స్థలంలోనే లభ్యమవ్వటంతో దాంట్లో ఉన్నది తనకు దక్కాలని నర్శింహులు ఆశపడుతున్నాడు. కానీ నిధి నిల్వలు,పురాతన వస్తువులు ఎక్కడ లభ్యమైనా అవి గవర్నమెంట్ కే చెందుతాయి. భూమిలో లోపల లభ్యమైనవి జాతి వారసత్వ సంపదగా ప్రభుత్వానికే చెందుతుంది. ఇలా లభ్యమైనవాటిలో విలువైనవి ఉంటే అది వారి పూర్వీకులవా? లేదా గుప్తనిధులా? అనే విషయాలు తెలిస్తే ఆయా వివరాల ప్రకారం ఎవరికి చెందుతుంది? అనేది అధికారులు నిర్ణయిస్తారు. గుప్త నిధి అయితే ఆయా స్థలాల వ్యక్తులకు కొంత శాతం దక్కుతుంది. మిగతాది ప్రభుత్వానికి చెందుతుంది. లేదా అది జాతీయ సంపద అని తేలితే మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇలా భూమిలో లభ్యమయ్యే వస్తువులు..విలువైనవాటి విషయంలో దానికి సంబంధించిన చట్టాల ప్రకారం ప్రక్రియ కొనసాగుతుంది.