ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఎఎస్ జి.వాణి మోహన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ శనివారం(30 మే 2020) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1996 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి వాణీమోహన్.. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ కమిషనర్, కోఆపరేషన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్, ఏపీ డైరీ అభివృద్ధి సమాఖ్య ఎండీగా, పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రంలో SEC పదవి రెండు నెలలుగా వివాదాస్పదంగా మారింది. మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని శుక్రవారం(29 మే 2020) తిరిగి ప్రారంభించారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతనిని తిరిగి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించగా.. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా SEC కార్యాలయానికి రమేష్ కుమార్ రావడానికి అధికారం లేదని, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.