Ap Corona
Andhra Pradesh Corona Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే..గతంలో కంటే..తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం. రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 332 మందికి కరోనా సోకింది. ఏడుగురు మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Read More : Ram paid 500rs fine: రామ్.. దశరథుని కొడుక్కి రూ.500 ఫైన్, గవర్నమెంట్ కు డబ్బులొచ్చాయంతే..
రాష్ట్రంలో ప్రస్తుతం 6 వేల 193 యాక్టివ కేసులున్నాయి. కరోనా బారిన పడిన 585 మంది కోలుకున్నారని హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 24 గంటల్లో 29 వేల 243 మంది నమునాలు పరిక్షీంచారు. కోవిడ్ వల్ల కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 55మంది వైరస్ బారిన పడ్డారు.
Read More : RK Funeral: మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు
జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 07. చిత్తూరు 55. ఈస్ట్ గోదావరి 32. గుంటూరు 42. వైఎస్ఆర్ కడప 43. కృష్ణా 32. కర్నూలు 03. నెల్లూరు 22. ప్రకాశం 25. శ్రీకాకుళం 04. విశాఖపట్టణం 28. విజయనగరం 03. వెస్ట్ గోదావరి 36. మొత్తం : 332