Blast in Police Station : పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు .. మర్రిచెట్టుకింద దాచి పెట్టిన..

చిత్తూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ లో అర్ధరాత్రి భారీ శబ్దంతో బ్లాస్ట్ జరిగింది.

blast in ganadhara nellore police station

Blast in Police Station : చిత్తూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌ లో అర్ధరాత్రి 3 గంటల సమయంలో భారీ శబ్దంతో బ్లాస్ట్ (Blast in Police Station) జరిగింది. ఈ పేలుడు గురించి ఎస్పీ వివరిస్తూ ఎటువంటి ఆందోళన పడాల్సిన పనిలేదని..2018 జూన్ లో ఓ కేసుకు సంబంధించి గన్ పౌడర్ ను సీజ్ చేశామని దాన్ని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ మర్రిచెట్టు కింద పాతిపెట్టామని అదే పేలిందని తెలిపారు. ఈ పేలుడు వల్ల ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.ప్రజలకు గానీ పోలీస్ సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు కాలేదని తెలిపారు.

పేలుడు శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీయగా అది 2018 జూన్ లో ఓ కేసుకు సంబంధించి గన్ పౌడర్ ను సీజ్ చేసిన దాన్ని మర్రిచెట్టు కింద పాతిపెట్టామని అదే పేలిందని తెలిపారు ఎస్పీ. పేలుడు సమయంలో పీఎస్‌లో నైట్ డ్యూటీలో ఇద్దరు  ఉన్నట్లుగా పేలుడు ధాటికి పగిలిన కిటికీ గాజు ముక్కలు వారిపై పడి  స్పల్ప గాయాలు అయినట్లుగా సమాచారం.