×
Ad

Amaravati: చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ.. సెకండ్ పేజ్ ల్యాండ్ పూలింగ్‌కు ఆమోదం తెలపనున్న క్యాబినెట్

వీలునామా రాయకుండా చనిపోతే పూర్వీకుల వ్యవసాయ ఆస్తులకు సంబంధించి నియమిత స్టాంపు డ్యూటీ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తున్నారు.

Amaravati: అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. ఇందులో 26 అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాజధానిలో మరో 16,666.57 ఎకరాల భూసమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ మేరకు సెకండ్ పేజ్ ల్యాండ్ పూలింగ్‌కు క్యాబినెట్‌లో ఆమోద ముద్ర పడనుంది.

ఏపీ టిడ్కోపై పూర్తిస్థాయి నివేదికను నేడు టేబుల్ అజెండా మంత్రిమండలి ముందుకు తీసుకురానున్నారు. వీలునామా రాయకుండా చనిపోతే పూర్వీకుల వ్యవసాయ ఆస్తులకు సంబంధించి నియమిత స్టాంపు డ్యూటీ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తున్నారు. (Amaravati)

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 33 ఎకరాల భూమిని పలమనేరు అగ్రి మార్కెటింగ్ కమిటీకి చేసేందుకు మంత్రిమండలిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

Also Read: “5 కోట్లు ఇవ్వు.. లేదంటే బంగారం ధరించడానికి నీ శరీరం ఉండదు” అంటూ ‘గోల్డ్‌మ్యాన్’కు బెదిరింపులు.. ఏమైందంటే?

ఏపీలోని నూర్ బాషా, దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌లో నేడు చర్చిస్తారు. పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్టసవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.

ఇంధన శాఖ నాబార్డు నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీ కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. వివిధ పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.

ఎమెండెడ్‌ భారత్‌ నెట్‌ ప్రోగ్రామ్‌ అమలుకు ఎస్‌పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్‌ సొసైటీలో డిప్యూటేషన్‌, ఒప్పంద పద్ధతిలో 16 పోస్టులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. పంచాయతీరాజ్‌ చట్టంలో పలు సవరణలకు ఆమోదం తెలపనుంది.

పోలవరం ప్రాజెక్టు పరిధిలో రూ.542.85 కోట్ల పనులకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.
వివిధ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలపనుంది.