YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్

CM జగన్ రాజ్యసభకు పంపించే అభ్యర్ధుల పేర్లను దాదాపు ఖరారు చేశారు.

AP Rajyasabha Candidates: CM జగన్ రాజ్యసభకు పంపించే అభ్యర్ధుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. వైసీపీలో నంబర్ టూ గా భావించే విజయసాయిరెడ్డిని మరోసారి పెద్దల సభకు పంపించాలని సీఎం జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్ధుల పేర్లలో విజయసాయి కూడా ఉన్నారు. ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు సీట్లకు వచ్చే జూన్ లో ఎన్నిక జరగనుంది.

వైసీపీ నుంచి రాజ్యసభకు పంపే అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంట్లో భాగంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి మళ్లీ అవకాశం దక్కనుంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు పేర్లను కూడా అభ్యర్థులుగా సీఎం జగన్ దాదాపు ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సీట్లకు జూన్ లో ఎన్నిక జరగనుంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రకటించేశారు.

రాజ్యసభ ఎన్నికల కోసం మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.

ట్రెండింగ్ వార్తలు