Andhra Pradesh Coronavirus (5)
Andhra Pradesh Coronavirus : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 665 మందికి కరోనా సోకింది. 16 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో ప్రస్తుతం 28 వేల 680 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 13 వేల 302 మంది మృతి చెందారు. అత్యధికంగా చితూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 529 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 19,22,843 పాజిటివ్ కేసులకు గాను 18,81,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :
తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం ఇద్దరు, కృష్ణా, విశాఖ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 106. చిత్తూరు 353. ఈస్ట్ గోదావరి 529. గుంటూరు 223. వైఎస్ఆర్ కడప 161. కృష్ణా 281. కర్నూలు 33. నెల్లూరు 195, ప్రకాశం 285, శ్రీకాకుళం 56, విశాఖపట్టణం 112, విజయనగరం 38, వెస్ట్ గోదావరి 293. మొత్తం : 2,665