Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 1,578 కరోనా కేసులు.. 22 మంది మృతి

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 1,578 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh Coronavirus : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 1,578 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 27 వేల 195 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 13 వేల 324 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 19,24,421 పాజిటివ్ కేసులకు గాను 18,84,202 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :

తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు ముగ్గురు. కృష్ణా ముగ్గురు, నెల్లూరు ముగ్గురు ప్రకాశం ముగ్గురు, శ్రీకాకుళం ఇద్దరు, కర్నూలు ఒక్కరు, విశాఖ ఒక్కరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 37. చిత్తూరు 257. ఈస్ట్ గోదావరి 305. గుంటూరు 97. వైఎస్ఆర్ కడప 117. కృష్ణా 92. కర్నూలు 35. నెల్లూరు 197, ప్రకాశం 173, శ్రీకాకుళం 31, విశాఖపట్టణం 68, విజయనగరం 35, వెస్ట్ గోదావరి 152. మొత్తం : 1,578

ట్రెండింగ్ వార్తలు