AP Corona Cases : ఏపీలో కొత్తగా 2,058 కరోనా కేసులు.. 23 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,353 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,66,175కు చేరింది.
- kunduru Vinod
- Published On : July 31, 2021 / 05:13 PM IST
andhra pradesh corona cases update : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 23 మంది మృతి చెందారు. 2,353 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,66,175కు చేరింది.
ప్రస్తుతం 21,180 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వల్ల చిత్తూరు ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశం ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి ఇద్దరు, కర్నూలు ఇద్దరు, గుంటూరు ఇద్దరు, శ్రీకాకుళం ఒక్కరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు.
జిల్లాల వారీగా కేసులు
అనంతపురం 47. చిత్తూరు 284. ఈస్ట్ గోదావరి 364. గుంటూరు 182. వైఎస్ఆర్ కడప 140. కృష్ణా 325. కర్నూలు 11. నెల్లూరు 173. ప్రకాశం 242. శ్రీకాకుళం 45. విశాఖపట్టణం 89. విజయనగరం 29. వెస్ట్ గోదావరి 127. మొత్తం : 2,058
