Andhra Pradesh Coronavirus : ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు, 26 మంది మృతి
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గత పదిరోజులుగా 2,3 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2 వేల 925 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
- kunduru Vinod
- Published On : July 10, 2021 / 04:49 PM IST
Andhra Pradesh Coronavirus (4)
Andhra Pradesh Coronavirus : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గత పదిరోజులుగా 2,3 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2 వేల 925 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఏపీలో ప్రస్తుతం 29 వేల 262 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 986 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 611 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 19,20,178 పాజిటివ్ కేసులకు గాను 18,77,930 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :
చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలు ఇద్దరు, నెల్లూరు ఇద్దరు, శ్రీకాకుళం ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడప, విశాఖ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.
జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 84. చిత్తూరు 414. ఈస్ట్ గోదావరి 611. గుంటూరు 211. వైఎస్ఆర్ కడప 180. కృష్ణా 250. కర్నూలు 117. నెల్లూరు 199, ప్రకాశం 260, శ్రీకాకుళం 67. విశాఖపట్టణం 139. విజయనగరం 32. వెస్ట్ గోదావరి 361. మొత్తం : 2,925
