Andhra Pradesh Coronavirus Update: ఏపీలో కరోనా వ్యాప్తికి అడ్డకట్టపడటంలేదు. పదివేలకు దగ్గర్లోనే ప్రతిరోజూ కొత్త కేసులు నమోదువుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నాయి, కరోనా కేసులూ పెరుగుతున్నాయని అంటోంది ప్రభుత్వం. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,137 శాంపిల్స్ పరీక్షిస్తే, 9,999 పాజిటీవ్ కేసులుగా తేలాయి. ఇదే సమయంలో 77 మంది చనిపోయాని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆనందకరమైన విషయమేంటేంటే… 11,069 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అంటే… కొత్త కేసులుకన్నా, డిశ్చార్జ్ అయినవాళ్లే ఎక్కువ.
గోదావరి జిల్లాలే హాట్‌స్పాట్!
మొత్తం 9,999 కేసుల్లో తూర్పుగోదావరిలో 1499, పశ్చిమగోదావరిలో 1081, చిత్తూరులో 1040 కేసులు నమోదైయ్యాయి. ఏపీకి గోదావరి జిల్లాలకే హాట్ స్పాట్ గా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 44,52,128 శాంపిల్స్ పరీక్షిస్తే, 5,47,686 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,46,716 మంది కోలుకున్నారు. ఇంటికెళ్లారు. కాకపోతే 4779 మంది ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. ప్రస్తుతం 96,191 యాక్టీవ్ కేసులున్నాయి.