×
Ad

ఏపీ యువత గెట్‌రెడీ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95% రిజర్వేషన్.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

నూతన గెజిట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.

AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు 95% స్థానికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రాన్ని మల్టీ జోన్-1, మల్టీ జోన్-2గా విభజించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతి మల్టీ జోన్‌ను 6 ఉప-జోన్లుగా విభజించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఉద్యోగ నియామకాల్లో మల్టీ జోన్-ఉప జోన్ విధానం కీలక పాత్ర పోషించనుంది.

Also Read: శుభవార్త.. ఇక మరింత వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

నూతన గెజిట్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. నియామక ప్రక్రియలో ప్రాంతీయ సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు కేంద్రం ప్రకటిచింది.