AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం..

AP Govt IAS Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt IAS Transfer

AP Govt : ఏపీ ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ (AP Govt IAS Transfers) చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన కలెక్టర్లు వీరే..

♦ పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి
♦ విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి
♦ తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి
♦ గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా
♦ పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా
♦ బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌
♦ ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు
♦ నెల్లూరు కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
♦ అన్నమయ్య కలెక్టర్‌గా నిషాంత్‌ కుమార్‌
♦ కర్నూలు కలెక్టర్‌గా ఎ.సిరి
♦ అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్‌
♦ సత్యసాయి కలెక్టర్‌గా శ్యాంప్రసాద్‌

ఐఏఎస్‌ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్నిరోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్రంలోని 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. మూడ్రోజుల వ్యవధిలోనే మరోమారు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం గమనార్హం. అయితే, ఈసారి ఈ బదిలీ ప్రక్రియలో పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను ఏపీ సర్కార్ నియమించింది.