AP Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సోమవారం సాయంత్రం ఏపీ ఇంటర్‌బోర్డ్ ఈ షెడ్యూల్ విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం… 2023 మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.
Telangana: కీలక మలుపు తిరిగిన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. విచారణ సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశం
మార్చి 15-ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16-ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ నుంచి మే రెండో వారం దాకా ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఒక రోజు మొదటి సంవత్సరం పరీక్ష, మరుసటి రోజు రెండో సంవత్సరం పరీక్ష జరుగుతుంది. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి మే 10 వరకు, రోజూ రెండు సెషన్లుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.
ఆదివారం కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అలాగే ఫిబ్రవరి 22న, ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామినేషన్’, ఫిబ్రవరి 24న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్’ జరుగుతుంది.