MP Vijay Saireddy : పరిశ్రమలకు ఏపీ అనుకూలమైన రాష్ట్రం: ఎంపీ విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రమని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. కోవిడ్ సమయం లో 1.58 శాతం వృద్ధి సాధించామని తెలిపారు.
- bheemraj
- Updated on- November 1, 2021 / 02:46 PM IST
Vijay Saireddy
Andhra Pradesh industrial state : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు అనుకూలమైన రాష్ట్రమని వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి తెలిపారు. కోవిడ్ సమయం లో 1.58 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. చిన్న, మద్య తరహా పరిశ్రమల అభివృద్ధికి వైసీపీ ప్రభ్యత్వం 2087 కోట్లు కేటాయించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా లేని మూడు రాజధానులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. దీని వలన విశాఖ కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య కూడా ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. AP chembers of commers యొక్క సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. ప్రేమ సమాజం ఒక మహత్తర కార్యం కోసం స్థాపించబడిందని పేర్కొన్నారు.
Maha Padayatra : అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం
కుల, మతాల తేడాలు లేకుండా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రేమ సమాజం ఎంతో సేవ చేస్తుందని వివరించారు. ప్రేమ సమాజం భూముల్లో మంచి కన్వెన్షన్ సెంటర్ కట్టండిన..దానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. నగరం మద్యలో ప్రేమ సమాజంలో ఉన్న గోవులను సిటీ బయట ఉన్న స్టలంలోకి తరలిస్తే గోవులకి ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
