Ap Covid Cases Update
AP Covid Update : ఆఁధప్రదేశ్‌లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 57 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కోవిడ్ నియంత్రణ విభాగం ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. అదే సమయంలో 84 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని పేర్కోన్నారు.
Also Read : Punjab AAP : కొడుకు ఎమ్మెల్యే.. తల్లి స్వీపర్, చీపురును వదలనంటోంది
దీంతో రాష్ట్రంలో ఇంతవరకు 23 లక్షల 18 వేల 858 మందికి కొవిడ్ సోకగా, వారిలో 23 లక్షల 3 వేల 522 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న ఎటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆ బులెటిన్ లో వివరించారు.