minister ambati rambabu
ambati rambabu : ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు ప్రమాదం తప్పింది. అంబటి రాజమండ్రి నుంచి ఖమ్మంవైపు కారులో సత్తుపల్లి పట్టణ శివారులో ఆయన కాన్వాయిపై పక్కనుంచి వెళుతున్న లారీ పై నుంచి గోధుమ బస్తాలు పడ్డాయి. అంబటి ప్రయాణిస్తున్న కారుపై గోధుమ బస్తాలు పడటంతో కారు స్వల్పంగా దెబ్బతింది. దీంతో ఆయన కారు దిగి వెనుక కారు ఎక్కి ఖమ్మంవైపుగా వెళ్లిపోయారు.ఈ ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు రంగంలోకి దిగి సదరు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా సత్తుపల్లి నగర శివారులోని హోండా షోరూం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమ బస్తాల లోడుతో వస్తున్న లారీ తాళ్లకు తగలడంతో తాళ్లు తెగిపోయిన గోధుమ బస్తాలు మంత్రి అంబటి కారు బానెట్‌పై పడ్డాయి. దీన్ని వెంటనే గమనించి అప్రమత్తమైన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. తరువాత ఆయన కాన్వాయ్ లోని వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనపై మంత్రి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లారీ ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతోంది..? ప్రమాదం ఎలా జరిగింది…? అనే కోణంలో విచారిస్తున్నారు.