AP Covid : ఏపీలో కోవిడ్ పంజా..24 గంటల్లో 4,528 కేసులు..చిత్తూరులో 1027

గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid New Cases : ఏపీ రాష్ట్రంలో కోవిడ్ హఢలెత్తిస్తోంది. కేసులు రోజురోజుకు అధికమౌతున్నాయి. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పండుగ సమయం కావడంతో ప్రజలు రాకపోకలు అధికం చేయడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో…ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Yogi : ఎన్నికల వేళ.. దళిత కుటుంబంతో సీఎం యోగి లంచ్

ఏపీలో ప్రస్తుతం 18 వేల 313 యాక్టివ్ కేసులుండగా…14 వేల 508 మరణాలు సంభవించాయని…39 వేల 816 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారు. 24 గంటల్లో 418 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,17,96,337 శాంపిల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,93,860 పాజిటివ్ కేసులకు గాను 20, 61, 039 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మొత్తం 14,508 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313గా ఉంది.

Read More : TDP Leader Murder Case : గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో 8మంది అరెస్ట్

జిల్లాల వారీగా కేసులు : – అనంతపురం : 300, చిత్తూరు : 1027, ఈస్ట్ గోదావరి 327, గుంటూరు : 377, వైఎస్ఆర్ కడప : 236, కృష్ణా : 166, కర్నూలు : 164, నెల్లూరు : 229, ప్రకాశం : 142, శ్రీకాకుళం : 385, విశాఖపట్టణం : 992, విజయనగరం : 121, వెస్ట్ గోదావరి : 62. మొత్తం : 4528

ట్రెండింగ్ వార్తలు