Yogi : ఎన్నికల వేళ.. దళిత కుటుంబంతో సీఎం యోగి లంచ్

ఓ దళిత కుటుంబానికి చెందిన నివాసానికి సీఎం యోగి ఆదిత్య నాథ్ వెళ్లారు. కుటుంబ పెద్దతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ...

Yogi : ఎన్నికల వేళ.. దళిత కుటుంబంతో సీఎం యోగి లంచ్

Yogi Lunch

UP CM Yogi Had Lunch : దేశం మొత్తం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తోంది. ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 2022 మేలో అసెంబ్లీ గడువు ముగియనుంది. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీజేపీని ఢీకొట్టేందుకు సమాజ్ వాదీ పార్టీ రెడీ అయిపోయింది. బీజేపీ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీ పార్టీ వైపు వెళ్లిపోయారు. అయినా…బీజేపీ ఏ మాత్రం చలించకుండా తన పని తాను చేసుకపోతోంది. అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ప్రచారాన్ని ముమ్మరం చేపట్టారు.

Read More : Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

2022, జనవరి 14వ తేదీ శుక్రవారం ఓ దళిత కుటుంబానికి చెందిన నివాసానికి వెళ్లారు. వెళ్లడమే కాకుండా కుటుంబ పెద్దతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ…మకర సంక్రాంతి సందర్భంగా…తనను ఆహ్వానించి…Khichri Sahbhoj భోజనం పెట్టినందుకు షెడ్యూల్ కులాల కమ్యూనిటీకి చెందిన భారతికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

Read More : Novak Djokovic: జకోవిచ్ వీసా క్యాన్సిల్, మూడేళ్ల నిషేదం

యూపీ ఎన్నికల్లో పాలించేది కుల రాజకీయాలే అని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ పార్టీలు ఓబీసీ ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తున్నారు. ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత మౌర్య సామాజిక వర్గమే యూపీలో అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. ఓబీసీలలోనే మరింత వెనుకబడిన వర్గమైన నోనియా కులం తూర్పు యూపీ జనాభాలో మూడు శాతం ఉంటుంది. వీరి ఓట్లు కూడా బీజేపీకి అవసరం. ప్రస్తుతం వీరిని ఆకట్టుకొనే పనిలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. నామినేటడ్ స్థానంతో కలిపి 404 అసెంబ్లీ స్థానాలున్నాయి.

Read More : Monkey Attack : కోతి దాడి నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పైనుంచి పడి మహిళ మృతి

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.
పోలింగ్ దశలు 7.
పోలింగ్ తేదీలు : ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 03, మార్చి 07.
2017లో బీజేపీ తిరుగులేని విజయం. బీజేపీకి ఇక్కడ 303 స్థానాలున్నాయి.

Read More : Train Derailed: రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

ఎస్పీకి 49 స్థానాలు.
బీఎస్పీకి 15 స్థానాలు.
కాంగ్రెస్‌కు 7 స్థానాలు.
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ.
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ.
యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.