Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. కస్టమర్ ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ అవుతోంది. కొందరికి ఆన్‌లైన్ సంస్థలు డెలివరీ చేస్తున్న వస్తువులు షాక్ కి..

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

Online Shopping

Online Shopping : ఇప్పుడు అంతా ఆన్ లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఏ వస్తువు కావాలన్నా కాలు బయట పెట్టకుండానే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. జస్ట్ ఒక్క క్లిక్ తో.. షాపులకు వెళ్లకుండానే కోరుకున్న వస్తువు మన కళ్ల ముందు ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే నచ్చిన ప్రొడక్ట్ డోర్ డెలివరీ అవుతోంది. అంతేకాదు బయట షాపులతో పోల్చుకుంటే ఆన్ లైన్ లో మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో షాపింగ్ చేసేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

అదే సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్ ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ అవుతోంది. కొందరికి ఆన్‌లైన్ సంస్థలు డెలివరీ చేస్తున్న వస్తువులు షాక్ కి గురి చేస్తున్నాయి. కస్టమర్లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరోటి పంపుతున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రాళ్లూ, రప్పలూ కూడా వస్తున్నాయి. సెల్ ఫోన్ బుక్ చేస్తే సబ్బులు, ఇటుకలు, వచ్చిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి షాకింగ్ ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. రూ.16 వేల ఫోన్ ఆర్డర్ చేస్తే ఆ వ్యక్తికి అరకిలో రాయి వచ్చింది.

Ginger Tea : అల్లం టీ ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవా?

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఫోన్ బుక్ చేయగా.. రాయి వచ్చింది. ఫోన్ స్థానంలో రాయి చూసిన ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఉరవకొండ పట్టణానికి చెందిన వంశీకృష్ణ ఈ నెల 6న రూ.16 వేలు పెట్టి MI A3 ఫోన్ బుక్ చేశాడు. గురువారం ఉదయం డెలివరీ బాయ్ అతడికి పార్శిల్ ఇచ్చాడు.

ఎంతో హ్యాపీగా పార్శిల్ ను ఓపెన్ చేసిన వంశీకృష్ణకు షాక్ కొట్టినంత పనైంది. ఎందుకంటే, అందులో ఫోన్ లేదు. అరకిలో బరువైన రాయి ఉంది. అంతే, అతడి దిమ్మతిరిగిపోయింది. కాగా, పార్శిల్ ను ఓపెన్ చేసే క్రమంలో వీడియో తీసుకున్నాడు. వంశీకృష్ణ వెంటనే డెలివరీ బాయ్‌ను నిలదీశాడు. అయితే, తనకేమీ సంబంధం లేదని అతడు చెప్పడంతో వంశీకృష్ణ.. ఆర్డర్ బుక్ చేసిన ఈ కామర్స్ పోర్టల్ సిబ్బందితో మాట్లాడాడు. దీంతో డెలివరీ బాయ్ అతడికి డబ్బులు వెనక్కి ఇచ్చేశాడు. రాయి ఉన్న బాక్స్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చిన ఘటన అందరిని విస్మయానికి గురి చేసింది.

Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే?

ఏది ఏమైనా ఆన్ లైన్ లో వస్తువులు ఆర్డర్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫర్లకు ఆశపడ్డారో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నమ్మకమైన, గుర్తింపు పొందిన సంస్థల్లో మాత్రమే వస్తువులు కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.