Monkey Attack : కోతి దాడి నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పైనుంచి పడి మహిళ మృతి
జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వచ్చిన మహిళ కోతి దాడి నుంచి తప్పించుకోబోయి డాబాపై నుంచి కింద పడి మరణించింది.

Woman Died
Monkey Attack : జగిత్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వచ్చిన మహిళ కోతి దాడి నుంచి తప్పించుకోబోయి డాబాపై నుంచి కింద పడి మరణించింది.
జిల్లాలోని ధర్మపురిలోని బ్రాహ్మణవాడకు చెందిన రాజేశ్వరి(50) అనే మహిళ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కాగా… సంక్రాంతి పండగ సెలవులకు స్వగ్రామం ధర్మపురికి రెండు రోజుల క్రితం వచ్చింది.
రాజేశ్వరి ఊళ్లో నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లింది. కాగా… ఆ సమయంలో అక్కడే ఉన్న కోతి ఒకటి ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించింది. కోతి దాడినుంచి తప్పించుకుని కిందకు పరుగెత్తే క్రమంలో రాజేశ్వరి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడి మరణించింది.
Also Read : Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.