Andhra Pradesh: రూ.15వందల కోట్ల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు

ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు 5వేల 965ఎకరాల్లో వేసిన 29లక్షల 82వేల 425 గంజాయి మొక్కలను పోలీసులు నాశనం చేశారు. 36రోజులుగా పెరుగుతున్న రూ. వెయ్యి 491కోట్ల..

Andhra Pradesh: ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు 5వేల 965ఎకరాల్లో వేసిన 29లక్షల 82వేల 425 గంజాయి మొక్కలను పోలీసులు నాశనం చేశారు. 36రోజులుగా పెరుగుతున్న రూ. వెయ్యి 491కోట్ల పంట ధ్వంసమైనట్లుగా అంచనా. పలు మార్లు ఆంధ్రప్రదేశ్ – ఒరిస్సా సరిహద్దుల్లో దాడులు జరిపిన పోలీసులు ఎట్టకేలకు వాటిని గుర్తించారు.

టెక్నాలజీ, ఎన్ఫోర్స్‌మెంట్, ఇంటిలిజెన్స్, పోలీసు డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా గంజాయి పంటను నిర్మూలించగలిగారు. గంజాయి పంట నాశనంతో చేయడంతో పాటు చాలా మంది గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధులను చూపించారు.

అక్టోబర్ 31న లాంచ్ అయిన పరివర్తన ఆపరేషన్ లో భాగంగా స్టేట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ గంజాయి పంటలను నాశనం చేయడంతో పాటు, గిరిజనల ప్రవర్తనల్లోనూ మార్పులు తీసుకొచ్చింది. విశాఖపట్నం పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరోలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.

…………………………………….. : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

 

ట్రెండింగ్ వార్తలు