Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తగినంత మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగించటంలో సహాయపడుతుంది.

Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

Weight Loss (1)

Lose Weight : కరోనా కారణంగా చాలా మంది ఇళ్ళకే పరిమితమైపోయారు. దీంతో అధిక బరువుతో ఇబ్బందిపడుతూ ఎలాగైనా బరువును తగ్గించుకోవాలన్న ప్రయత్నాలు ఉన్నారు. అలాంటి వారు బరువు తగ్గించుకునేందుకు ప్రస్తుతం ఓ చిన్న స్లోగన్ బాగా ఉపకరిస్తుంది. అదేంటంటే తక్కువ తినండి… ఎక్కువ కదలండి అనే నినాదం ఊపందుకుంది.

ఇదే విషయాన్ని ఆరోగ్యనిపుణులు సైతం తమ వద్దకు అధిక బరువుతో వస్తున్న వారికి సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు తీసుకోని ఎక్కువ పని చేయాలి. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించడానికి శారీరక శ్రమ అవసరం. ఈ ప్రయత్నంలో తొలినాళ్ళల్లో ఇబ్బంది కరకంగా ఉన్న నిదానంగా అలవాటై పోతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల, కొత్త అనుభూతి లభించటంతోపాటు శరీరం తేలికగా మారుతుంది. చిరాకు, మానసిక కల్లోలం వంటి బలహీనతలన్నీ తొలగిపోతాయి.

తక్కువ తినండి, ఎక్కువ కదలండి అనే నినాదం కొంతమందికి తార్కికంగా అనిపించవచ్చు గాని దీర్ఘకాలంలో మీ ఆరోగ్యానికి , బరువు నియంత్రణకు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదు. కేలరీల తీసుకోవడం తగ్గించడం ద్వారా బరువును తగ్గించుకోవటం ఏమాత్రం సరైనది కాదన్న వాదన కూడా ఉంది. ఇలా చేయటం ప్రారంభించిన తొలినాళ్ళల్లో కిలోల కొద్దీ బరువు తగ్గి సానుకూల ఫలితాలను పొందవచ్చు. అయితే తగ్గిన బరువు తిరిగి పెరగకుండా చూసుకోవటం చాలా ముఖ్యమైనది. అలాంటి వారు కొన్ని ఆహార నియమాలు అనుసరించటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

ఇతర పోషకాల మాదిరిగానే, కార్బోహైడ్రేట్లు కూడా మన శరీరానికి అవసరం. శక్తిని ఉత్పత్తి చేయడానికి జీవక్రియలకు ఇది అవసరం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆహారంలో కూరగాయలు, పండ్లు , తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను తీసుకోవాలి. శుద్ధి చేసిన పిండి వంటి అనారోగ్యకరమైన పిండి పదార్థాలు , బంగాళదుంపలు వంటి పిండి పదార్ధాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తగినంత మొత్తంలో ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగించటంలో సహాయపడుతుంది. ప్రోటీన్ వినియోగం కండరాలను నిర్మాణంతోపాటు, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి కీలకంగా ఉపయోగపడుతుంది. జీవక్రియ రేటును పెంచడం ద్వారా కొవ్వును కరిగించే ప్రక్రియను ప్రోటీన్ వేగవంతం చేస్తుంది. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల కొత్త కణాల పుట్టుకకు సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న చాలా మందిలో అనేక అపోహలు ఉంటాయి. కొవ్వు తినడం వల్లే తాము లావుగా, బరువు పెరుగామని అనుకుంటారు. నిజానికి, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తక్కువ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల శరీరం కొవ్వును కరిగించే స్థితికి వెళ్లేలా చేస్తుంది. శరీరం రోజువారీ పనితీరుకు అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడానికి నిల్వ చేసిన కొవ్వును కరిగిస్తుంది. ఈప్రక్రియ మిమ్మల్ని సన్నబడేలా చేస్తుంది. కొవ్వు యొక్క ఆరోగ్యకరమైన మూలాలు మీ హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటును నిర్వహించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గే విషయానికి వస్తే సమయానికి ఆహారం తీసుకోవడం అనేది ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది. అదేసమయంలో కోల్పోయిన బరువును స్ధిరంగా కొనసాగించటానికి తప్పనిసరిగా జీవనశైలి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేళాపాళ లేకుండా, తినడం వల్ల సాధారణం కంటే ఎక్కువగా తినేందుకు దారితీస్తుంది. తద్వారా శరీరంలో అదనపు కొవ్వు నిల్వ దోహదం అవుతుంది. చివరకు అది అజీర్ణం మరియు ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తుంది.