ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నా నిర్ణయమే ఫైనల్: స్పీకర్ తమ్మినేని సీతారాం

Tammineni Sitaram ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. మంగళవారం ఆయన 10tvతో మాట్లాడుతూ.. అనర్హత వేటు విషయంలో తన నిర్ణయమే ఫైనల్ అంటూ స్పష్టం చేశారు. తనకున్న విచక్షణాధికారం మేరకే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో ఫిరాయింపులకు చోటు లేదని కుండబద్దలు కొట్టారు.

”ఇకపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఎవరైనా వేటు తప్పదు. ఎమ్మెల్యేలు న్యాయస్థానాలకు వెళ్లినా నేను తీసుకున్న నిర్ణయమే ఫైనల్. సమయం ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. పార్టీలు మారతారు.. విచారణకు రమ్మంటే రారు. వైసీపీ ప్రభుత్వంలో ఫిరాయింపులకు స్థానం లేదు. ఇకపై ఎవరు పార్టీలు మారాలని చూసినా ఇదే ఉదాహరణగా చూస్తార”ని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు.

కాగా, 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ తమ్మినేని సోమవారం నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు.. టీడీపీ నుంచి బయటకు వచ్చిన మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీని అనర్హులుగా స్పీకర్ ప్రకటించారు.

Also Read: పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని జనసేన నేతలు రోడ్డున పడ్డారు: ఎంపీ మార్గాని భరత్

ట్రెండింగ్ వార్తలు