Andhra Pradesh : కడప గవర్నమెంట్ స్కూల్లో వింత ఆంక్షలు, విద్యార్ధినిలు బొట్టు, పువ్వులు పెట్టుకోవద్దని ఆదేశం

ఏపీలోని కడప జిల్లాలో వింత వింత ఆంక్షలు విధించారు. విద్యార్దినులు పువ్వులు, బొట్టు పెట్టుకుని స్కూల్ కు రాకూడదంటు ఆదేశించారు.

andhra pradesh govt school

Andhra Pradesh Govt School : ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని ఓ ప్రభుత్వం స్కూల్లో హెడ్మాష్టారు వింత వింత ఆంక్షలు విధించటం సంచలనంగా మారింది. విద్యార్దినులు బొట్టు పెట్టుకుని స్కూల్ కు రాకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు పువ్వులు కూడా పెట్టుకుని రావద్దు అంటూ ఆంక్షలు విధించారు. అలా బొట్టు, పువ్వులు పెట్టుకుని స్కూల్ కు వచ్చిన విద్యార్ధినులను మోకాళ్లపై కూర్చోపెట్టి పనిష్మెంట్ విధించారు. అంతేకాదు దేవుని మార్గంలో నడవాలని హితబోధ చేశారు. దేవుని మార్గంలో నడిస్తే పరీక్షల్లో చక్కగా పాస్ అవుతారని వారికి హితబోధ చేస్తు కొంతమంది విద్యార్ధినులను మోకాళ్లపై కూర్చోపెట్టారు.

దువ్వూరు మండలం బుక్కాయపల్లి ప్రభుత్వ స్కూల్లో హెడ్మాష్టారు విధించిన ఆంక్షలతో విద్యార్ధినులు మనస్తాపానికి గురయ్యారు. హెడ్మాస్టారు తీరుపై బాధిత విద్యార్ధినులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పిల్లలపై ఇటువంటి ఆంక్షలు విధించటమేంటి అంటూ మండిపడుతున్నారు.