Andhrapradesh : మూడేళ్లలో ఏం చేయలేనిది రెండేళ్లలో ఏం చేస్తారు? అంటూ వైసీపీ ఎమ్మెల్యేపై మహిళలు ఫైర్

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న వైసీపీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు..నేతలకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రజలు చేసే విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో సతమతమైపోతున్నారు వైసీపీ నేతలు. మహిళలు వేసే ప్రశ్నలకు కూడా కనీస సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో గడప గడపకు వెళ్లలేక...వెళ్లకపోతే జగన్ తో చీవాట్లు పడలేక తలలు పట్టుకుంటున్నారు.

Andhrapradesh : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతున్న వైసీపీ మంత్రులకు..ఎమ్మెల్యేలకు..నేతలకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. ప్రజలు చేసే విమర్శలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో సతమతమైపోతున్నారు వైసీపీ నేతలు. మహిళలు వేసే ప్రశ్నలకు కూడా కనీస సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో గడప గడపకు వెళ్లలేక…వెళ్లకపోతే జగన్ తో చీవాట్లు పడలేక తలలు పట్టుకుంటున్నారు.

దీంట్లో భాగంగానే కర్నూలులో జిల్లాలోని దూదేకొండలో ఎమ్మెల్యే శ్రీదేవికి మహిళల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మహిళలు సంధించే ప్రశ్నలకు ఎమ్మెల్యే శ్రీదేవి సమాధానం చెప్పలేక నానా పాట్లు పడ్డారు. ‘‘మరో రెండేళ్లు ఉంది కదమ్మా..మీకు సమస్యలు తీర్చేస్తాం’’ అంటూ ఏదో సర్ధి చెప్పుకొచ్చారు. దీంతో మహిళలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ‘ మూడేళ్లలో చేయలేనికి రెండేళ్లలో ఏం చేస్తారు? అంటూ మహిళలు ప్రశ్నించే సరికి ఎమ్మెల్యే శ్రీదేవికి ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు. దీంతో డంగైపోయి నవ్వలేక నవ్వుతూ అక్కడ నుంచి బయటపడ్డారు.

Also read : Andra pradesh : ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ

ఓ పక్క ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరోపక్క నేతలంతా ప్రజల్లో ఉండాలని జగన్ గారి హుకుం. దీంతో వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లుతుంటే ఎదురయ్యే నిరసనలు. ఈ రెండింటి మధ్యా మంత్రులు. ఎమ్మెల్యేలు నానా తంటాలు పడుతున్నారు. మూడేళ్లలో ఏం చేశారు? మరో రెండేళ్లు ఉంది ఏదో చేసేస్తాం అని చెబుతున్నారు మూడుళ్లలో చేయలేనికి రెండేళ్లలో ఏం చేస్తారు? అంటూ సూటిగా మహిళలు అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రజలతో ఈ మాటలు పడలేం అంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోకి వెళ్లలేక..అలాగని వెళ్లకుండా ఉంటే జగన్ తో చీవాట్లు పడలేక..తమ రాజకీయ మనుగడకు ఎక్కడ ముప్పు వస్తుందో..వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదేమో అన్నట్లుగా వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఈ కార్యక్రమం మన తిప్పలకే వచ్చిందా? అన్నట్లుగా నానా హైరానా పడిపోతున్నారు. ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా ప్రజలు ముఖాన చూడని నేతలు ఈ కార్యక్రమంతో ప్రజలతో చీవాట్లు తింటున్నారు.దీంట్లో భాగంగానే ఓట్లు అడగటానికి వచ్చిన మీ మాటలు నమ్మి ఓటు వేసినందుకు మాకు తగినశాస్తి జరిగింది అంటూ నేతల ముఖానే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు మహిళలు.

Also read : Pawan Kalyan : కోనసీమ ‘క్రాప్ హాలిడే’ పాపం వైసీపీ ప్రభుత్వానిదే : పవన్ కల్యాణ్

ఈ క్రమంలో పలు నిసనలు..విమర్శల మధ్య ఎట్టకేలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగించుకుని ఎమ్మెల్యే శ్రీదేవి తిరిగి ప్రయాణం కోసం తనకారు ఎక్కారు. దీంతో గ్రామస్థులు ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే కాన్వాయ్ ను అడ్డుకుని స్థానిక సమస్యలపై నిలదీశారు. కనీసం తాగటానికి కూడా నీరు లేదని..డ్రైనేజీ సమస్యలతో నానా పాట్లు పడుతున్నామని ఓట్లు అడగటానికి వచ్చిన నేతలు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవటానికి మాత్రం ఎందుకు రావటంలేదు? మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు వచ్చారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్ పాలనలో అది చేస్తాం…ఇది చేస్తాం అని తెగ హామీలు ఇచ్చారని ఇప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారు అంటూ విమర్శలు సంధించేసరికి ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు