AP Anna Canteen : కడపలో పెట్రోలు బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేత

కడపలో అర్థరాత్రి పెట్రోల్ బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేశారు అధికారులు.

Officers demolished the Anna Canteen in Kadapa  : ఏపీలో అన్న క్యాంటీన్ల కూల్చివేతలను కొనసాగిస్తోంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో పేదల కోసం నిర్మించిన అన్నా క్యాంటీన్లను వైపీపీ ప్రభుత్వం కూల్చివేస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం సొంత జిల్లా అయిన కడపలో మరో అన్నా క్యాంటీన్ ను ప్రభుత్వం కూల్చివేసింది. ఓ పెట్రోల్ బంకు కోసం అన్నా క్యాంటీన్ ను కూల్చిన వేసిన ఘటన అర్థరాత్రి జరిగింది. కడప పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న అన్నక్యాంటీన్ భవనాన్ని.. అధికారులు కూల్చివేశారు.

కడపలో అర్ధరాత్రి వేళ అన్న క్యాంటీన్‌ను అధికారులు కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేదలకు అతి తక్కువ ధరకు అల్పాహారం, భోజనం అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహించింది. కడపలో కూడా టీడీపీ ప్రభుత్వం రూ. 30 లక్షల ఖర్చుతో నిర్మించిన అన్నా క్యాంటీన్ ను ప్రభుత్వం కూల్చివేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ల నిర్వహణను పూర్తిగా నిలిపివేయటమే కాకుండాకట్టడాలను కూడా కూల్చి వేస్తోంది. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం తను అనుకున్న పని చేసుకుపోతోంది. కూల్చివేతల పనులు కొనసాగిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వాహణ నిలిపివేయటమే కాకుండా కోండి సమయంలో కడప క్యాంటీన్‌ను కొవిడ్ కేంద్రంగా మార్చారు. కోవిడ్ కేసులు తగ్గిపోయాక దాన్ని కూల్చివేయటంలో భాగంగా ఓ పెట్రోల్ బంక్ ను కారణంగా చూపినట్లుగా తెలుస్తోంది.

సోమవారం (మార్చి21,2022) అర్ధరాత్రి అన్నా క్యాంటీన్ భవనాన్ని అకస్మాత్తుగా కూల్చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. క్యాంటీన్‌లోని విలువైన, ఉపయోగపడే వస్తువులను కూడా బయటకు తీయకుండా అలాగే కూల్చివేయడం విమర్శలకు దారితీసింది. విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కడప నియోజకవర్గ టీడీపీ నేత అమీర్‌బాబు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

కూల్చివేసిన క్యాంటీన్ ప్రాంతంలో నగరపాలక సంస్థ పెట్రోలు బంకు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పెట్రోలు బంకు ఏర్పాటు కోసం నగరంలో బోల్డన్ని ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ అన్న క్యాంటీన్‌ భవనాన్ని కూల్చడం వైసీపీ ప్రభుత్వం కక్ష పూరిత విధానానికి నిదర్శనం అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు