Anil Kumar Yadav
నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. జిల్లాలో ఎవరైనా నేతలు, కార్యకర్తలను తాను బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు. తాను ఏదైనా తప్పు చేసుంటే ఇంట్లో వ్యక్తిగా తనను భావించి, క్షమించాలన్నారు. నెల్లూరు పౌరుషాన్ని నిలుపుతూ, మంచి పేరు తీసుకొస్తానని చెప్పారు.
ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను సీఎం జగన్ నిలబెడుతున్నారని అన్నారు. ఈ కారణంగానే మార్పులు, చేర్పులు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తల్లో ఓడిపోతామన్న భావన ఉండకూదని, గెలుస్తామన్న ధీమానే ఉండాలని సూచించారు. వైసీపీకి సైన్యం భారీగా ఉందని, పార్టీని గెలిపించుకుంటారని చెప్పారు.
Balashowry: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలశౌరి