Site icon 10TV Telugu

రైతుల అకౌంట్లలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడేది ఆరోజు నుంచే.. లిస్ట్‌లో మీపేరు లేకుంటే ఇలా చేయండి..

Annadata Sukhibhav scheme,

Annadata Sukhibhava Scheme

Annadata Sukhibhava: అన్నదాతల పంటల సాగుకు ఆర్థిక భరోసా అందించేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అర్హులైన రైతుల వివరాలతో లిస్ట్ రెడీ అయింది. ఆ లిస్ట్‌ను అధికారిక వెబ్‌సైట్, గ్రామ సచివాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. అయితే, ఈ పథకం నిధులు జూన్ నెల చివర్లోనే పడాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయకపోవటంతో రైతులు పథకం అమలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

పీఎం కిసాన్ పథకంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతీయేటా రూ.6వేలు మూడు దఫాలుగా రైతుల అకౌంట్లలో పడుతున్నాయి. వాటిలో పాటు ప్రతీయేటా రూ.14వేలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో పీఎం కిసాన్ పథకం రూ.2వేలు, అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన రూ.5వేలు మొత్తం రూ.7వేలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.

ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది. కానీ, పీఎం కిసాన్ పథకం నిధులు విడుదలపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈనెల 9వ తేదీ లేదా ఆ తరువాత పీఎం కిసాన్ నిధులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని తెలుస్తోంది. అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రిలీజ్ కానున్నాయి.

మరోవైపు.. అర్హత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ పథకం లిస్టులో కొందరు రైతుల పేర్లు రాలేదు. దీంతో వారు కూడా పథకంకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పథకంకు అర్హత పొందేలా వారివద్ద అన్ని పత్రాలు, నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటే వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది.

రైతులు లిస్ట్‌లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆన్‌లైన్ పోర్టల్‌లో సమాచారం లభించపోతే.. దగ్గరిలోని సచివాలయం వెళ్లండి. అక్కడి ఆర్‌బీకే అధికారి ఉంటారు. వాళ్లను సంప్రదిస్తే.. జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి చెబుతారు. ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నపక్షంలో రైతులు టోల్ ఫ్రీ నంబర్ 155251 కు ఫోన్ చేసి మీ దరఖాస్తుకు సంబంధించిన వివరాలు తెలియజేయవచ్చు.

పథకానికి అర్హత పొందలేకపోయిన రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకుడు, వ్యవసాయ అధికారిని ప్రత్యక్షంగా కలవాలి. లేదా రైతు సేవా కేంద్రాన్ని (RBK) సందర్శించి, అర్జీ సమర్పించాలి. ఈ అర్జీ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. తద్వారా పునఃపరిశీలనకు అవకాశం ఉంటుంది.

Exit mobile version