Perni Nani : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

పామర్రులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Perni Nani

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్.పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పామర్రులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్.పేట పోలీసులు పేర్ని నానిపై జీరో ఎఫ్ఎఆర్ 353(2),196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..

Also Read: మాట్లాడడానికి వస్తే కాల్పులు జరుపుతారా? సహించం.. తీన్మార్‌ మల్లన్నను అరెస్టు చేయకపోయారో..: కవిత

కాగా, పేర్ని నానిపై నిన్న కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేసు నమోదైంది. అవనిగడ్డ, పామర్రులో జరిగిన సమావేశాల్లో పేర్ని నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వైసీపీ “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.