నంద్యాలలో కుటుంబం సూసైడ్ కేసులో ట్విస్ట్, ఆత్మహత్యకు కారణం పోలీసులే అంటూ సెల్ఫీ వీడియో

  • Publish Date - November 7, 2020 / 01:16 PM IST

another twist in nandyal family suicide case : నంద్యాలలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం కేసులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అబ్దుల్‌ సలాం ఇంకా అతని కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అని తెలుస్తోంది. తమ మృతికి కారణం పోలీసులే అంటూ వారు ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.



ఆ వీడియోలో తాము ఏ తప్పు చేయలేదని.. దొంగతనానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ తీవ్ర ఆవేదనతో తెలిపారు. టార్చర్‌ భరించలేకపోతున్నానని, తమకు సాయం చేసే వారు ఎవరూ లేరని వాపోయారు. మా చావుతో అయిన మీకు మనశ్శాంతి కలుగుతుందని అనుకుంటున్నాను సార్.. అంటూ తీవ్ర ఆవేదనతో చెప్పాడు అబ్దుల్‌ సలాం.



వీడియోలో భార్య, కుమార్తె, కొడుకు కూడా ఉన్నారు. నంద్యాల వన్ టౌన్‌ సీఐ సోమశేఖర్‌ రెడ్డి వేధింపులు తాళలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టు అబ్దుల్‌ సలాం తల్లి ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.