AP 10th Results : ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా...2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు సురేశ్.

Adimulapu Suresh Press Meet : కరోనా కారణంగా..ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగలేదు. దీంతో ఫలితాల విషయంలో ఉత్కంఠ నెలకొంది. విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా…2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ టెన్త్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు సురేశ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గ్రేడ్స్ లేకపోతే..చాలా సమస్యలు వస్తాయని తమ దృష్టికి రావడంతో…హైపవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరికీ నష్టం జరుగకుండా క్షుణ్ణంగా అధ్యయనం చేసి విద్యార్థుల ప్రతిభను తీసుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు.

Read More : Aadhar Shila Scheme : మహిళలూ..రోజుకు రూ.29 పొదుపు చేయండీ..రూ.4లక్షలు అందుకోండీ..

హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గ్రేడ్లు కేటాయించామన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం యధావిధంగా ఆమోదించామన్నారు. రెండు విద్యా సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించని కారణంగా..గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. 20-21 సంవత్సరానికి (విద్యార్థుల ప్రతిభ)…రాత పరీక్ష ఉందో..ఎక్కువ వెయిట్ (70 శాతం) కమిటీ ఇచ్చిందన్నారు. మిగతా మూడు అంశాలకు సంబంధించి…(30 శాతం) కేటాయించామన్నారు. 6 లక్షల 26 వేల 981 విద్యార్థులు లబ్ది పొందారన్నారు. బాలురు 3,24,753..3,10,601 మంది బాలికలున్నారని తెలిపారు. మార్క్స్ మెమోను వెబ్ సైటలో ఉంచామన్నారు. www.bse.ap.gov.in వెబ్ సైట్ లో మార్కుల మెమో చూసుకోవచ్చన్నారు.

ట్రెండింగ్ వార్తలు