Ap Tenth Cls
AP Tenth Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా రద్దు అయిన పదో తరగతి పరీక్షల మార్కుల కేటాయింపులో కసరత్తులు మొదలుపెట్టింది. పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్ల కేటాయింపుకు ఏర్పాటు చేసిన ఛాయరతన్ కమిటీ కసరత్తు తుది దశకు చేరుకుంది.
ఫార్మాటివ్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది కమిటీ. పదో తరగతి విద్యార్థులకు అధికారులు రెండు ఫార్మాటివ్ పరీక్షలను నిర్వహించారు. ఫార్మాటివ్-1 పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన 3 సబ్జెక్టులను తీసుకుని ఆ మార్కుల యావరేజ్ లెక్కిస్తారు. ఇలానే ఫార్మాటివ్-2కు సైతం చేస్తారు.
ఉదాహరణకు 50 మార్కులకు ఫార్మాటివ్-1, ఫార్మాటివ్-2 పరీక్షలు నిర్వహించారనుకుందాం. ఓ విద్యార్థికి సరాసరి మార్కులు 35, 40 మార్కులు వస్తే మొత్తం కలిపి 75 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్కుల ఆధారంగానే విద్యార్థికి సబ్జెక్ట్ గ్రేడ్, టోటల్ గ్రేడ్ ఇవ్వనున్నారు. ఇంటర్నల్ మార్కుల ప్రోసెసింగ్ అమల్లోకి రావడానికి సర్కార్ జీఓ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. బుధవారంలోగా దీనిపై అధికారిక స్టేట్మెంట్ రావాల్సి ఉంది.