AP Budget 2024 : రూ.2.86లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. పూర్తి వివరాలు ఇలా..

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

AP Assembly 2024

AP Assembly Budget Session 2024 : ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2లక్షల86వేల 389 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని బుగ్గన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది.. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంధంగా భావిస్తారని బుగ్గన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించామని, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో సమాజంలో అత్యంత బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని బుగ్గన అన్నారు. మహనీయులు, మహాత్ములు, మహానుభావుల ఆలోచనలు, సూక్తులను ప్రతిబింబించేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన సాగిస్తుందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాదు, ఆయన అడుగుజాడల్లోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.

Also Read : AP Budget 2024 : అసెంబ్లీలో గందరగోళం.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. కేబినెట్ భేటీలో కొన్నికీలక నిర్ణయాలు ఇవే..

కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో యుద్ధనీతితో పాటు ప్రజా సంక్షేమం, పన్నుల గురించి చాలా విషయాలున్నాయి. పాలకుడు ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించాలన్న కౌటిల్యుడి మాటలకు అద్దంగా నిలిచేలా జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన సాగిందని బుగ్గన పేర్కొన్నారు. సవాళ్లను అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేశామని, సుస్థిర అభివృద్ధి దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేసిందని బుగ్గన చెప్పారు. ఆర్థికవేత్త జే.ఎం కీన్స్ 1936లో రచించిన ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్ ఇంట్రస్ట్ అండ్ మనీ ఆర్థిక మాంద్యంలో ఎక్కువ ఖర్చుపెట్టాలన్న మాటలను కోవిడ్ విపత్తులో అనుసరించాం. ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడం, వేగంగా చేయడం, ప్రత్యేకంగా చేయడమే కాదు వినూత్నంగా చేయాలన్న కీన్స్ మాటలకు కోవిడ్ లో ప్రభుత్వ కృషికి సాక్ష్యాలని బుగ్గన అన్నారు. ఐదేళ్ల పాలనలో ఏడు విధానాలు అనుసరించామని, అవే.. సుపరిపాలన, సామర్థ్య, మహిళా మహారాణులు, అన్నపూర్ణ, సంక్షేమ, సంపన్న, భూభద్ర ఆంధ్ర విధానాలతో ముందుకు నడిచాంమని బుగ్గన తన బడ్జెట్ ప్రంసగంలో చెప్పారు.

Also Read : AP Budget 2024 : బ‌డ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. వెల్లడించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

  • బడ్జెట్ వివరాలు..
  • రూ.2లక్షల 86వేల 389కోట్లతో వార్షిక బడ్జెట్.
  • రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు.
  • మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు.
  • ద్రవ్యలోటు రూ.55 వేల 817కోట్లు.
  • రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు.
  • జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం.
  • జీఎస్టీపీలో ద్రవ్యలోటు 3.51శాతం.
  • మొదటి మూడు, నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ఆమోదం.
  • ఎన్నికల తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం.

 

  • సుపరిపాలన..
  • గడప గడపకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు
  • 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు.
  • 2.6లక్షల మంది వలంటీర్ల నియామకం
  • రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంపు
  • ప్రతీ జిల్లాలో దిశ  పీఎస్ లను ఏర్పాటు చేశాం.
  • మౌలిక సదుపాయ పెంచాం.
  • 13 నుంచి 26 జిల్లాలకు జిల్లాల పెంపు.

 

  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం
  • రూ. 3,367 కోట్లతో విద్యాదీవెన కిట్టు.
  • 47లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐబీ విద్యావిదానం.
  • మనబడి – నాడు నేడులో 99.81శాతం స్కూళ్లలో మౌలిక వసతులు.
  • 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం.
  • ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్
  • 34లక్షల మంది విద్యార్థులకు ఉపయోగం.
  • రూ. 11,901 కోట్లతో జగనన్న విద్యా దీవెన, రూ. 4,267 కోట్లతో జగనన్న వసతి దీవెన. ఇప్పటి వరకు 52లక్షల మందికి లబ్ధి.
  • డ్రాప్ అవుట్ శాతం 20.37 నుంచి 6.62శాతంకు తగ్గింపు
  • విదేశీ విద్యాదీవెన కింద 1858 మందికి లబ్ది.
  • ప్రపంచంలోని 50 ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులకు సాయం

 

  • ఆరోగ్యం సంరక్షణ..
  • బోధనా ఆసుపత్రులకు 16,852 కోట్లు ఖర్చు.
  • నిర్విరామగా 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.
  • ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం.
  • వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూ.25లక్షలకు పెంపు.
  • ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధులను 3257కు పెంపు.
  • 2019-23 మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా 35.91లక్షల మందికి లబ్ధి.
  • కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం.
  • పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.
  • జగనన్న ఆరోగ్య సురక్ష కింద 10,754 శిబిరాలు
  • కోటీ 67లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు
  • 53,126 మంది ఆరోగ్య సిబ్బంది నియామకం.

 

  • నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ..
  • ఏపీలో 192 స్కిల్ హబ్ లు, 27 స్కిల్ కాలేజీ స్థాపించడం జరిగింది.
  • 2023 -24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా. వీరిలో 95శాతం మంది ఉద్యోగ అవకాశాలు పొందారు.
  • విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్ లు, క్లాస్ రూంలు ఏర్పాటు.
  • 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో పలు సంస్థల సహాయంతో అధునాత యంత్రాలు, యంత్ర పరిరకరాలతో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నాం.

 

  • మహిళా సాధికారత – నారీ శక్తి..
  • మహిళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాం.
  • 2021 -22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్, చైల్డ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాం.
  • జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 43లక్షల 61వేల మంది మహిళలకు 26,067 కోట్లు అందించాం.
  • ఈ పథకం వల్ల 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు 83లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
  • వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 2019 నుంచి 7.98లక్షల మందికి స్వయం సహాయక సంఘాల్లోని 78లక్షల 94వేల మంది మహిళలకు రూ. 25,571 కోట్లు చెల్లించడం జరిగింది.
  • వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26లక్షల మందికి జీవనోపాధికి భధ్రత కల్పించడానికి 14.129 కోట్లు చెల్లించాం.
  • జగనన్న పాల వెల్లువ పథకం కింద 3.60లక్షల మంది మహిళలకు 2,697 కోట్లు ఖర్చు చేశాం.
  • స్త్రీ, పిల్లల భద్రతను పెంపొందించాం.
  • దిశా మొబైల్ యాప్, దిశా పెట్రోల్ వాహనాలతోపాటు 26దిశా పోలీస్ స్టేషన్లను ప్రారంభించాం.

 

  • రైతున్నలకు మేలు..
  • వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద 1.60లక్షల మంది కౌలు రైతులకు, 93వేల అటవీ భూములు సాగు రైతులతో సహా మొత్తం 53లక్షల53వేల రైతుల ఖాతాల్లో 33,300 కోట్లు జమ చేశాం.
  • కౌలు రైతులకు, అటవీ భూముల సాగుదారులకు ఆర్థిక సహాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
  • డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 54లక్షల55వేల మంది రైతుల ఖాతాల్లో 7,802కోట్లు బీమా మొత్తాన్ని అందించాం.
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద 73లక్షల 88వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1,835 కోట్లు జమ చేశాం.
  • 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు.
  • ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,374కోట్లు సబ్సిడీని అందించాం.
  • 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం.
  • ఇన్ ఫుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22.85లక్షల మంది రైతులకు 1,977 కోట్లు అందించాం. మరో 1200 కోట్లు ఈ నెలలో అందించబోతున్నాం.
  • 127 కొత్త వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
  • ఉద్యాన వన రంగంలోని వివిధ పథకాల ద్వారా 17లక్షల27వేల మంది రైతులకు లబ్ధి జరిగేలా 4,363 కోట్లు అందించాం.
  • 2,356 మంది గ్రామ స్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాం.
  • జగనన్న పాల వెల్లువ ద్వారా అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డెయిరీ పునరుద్దరణ చేశాం.
  • 5వేల మందికి ప్రత్యక్షంగా, 2లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.
  • 340 సంచార పశువైద్య శాలల సేవలను అందుబాటులోకి తెచ్చాం.
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2లక్షల43వేల మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని 4వేల నుంచి 10వేలకు పెంచాం.
  • 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్, ఆయిల్ పై సబ్సిడీని పెంచాం.
  • 10 ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం చేపట్టాం.
  • 2వేల ఫిష్ ఆంధ్రా రిటైల్ దుకాణాలు స్థాపించాం.
  • 2లక్షల12వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకొచ్చాం.
  • 16లక్షల5వేల మందికి కొత్త జీవనోపాధి అవకాశాలు కల్పించి, రాష్ట్రాన్ని దేశానికే ఆక్వా హబ్ గా తీర్చిదిద్దాం.

 

  • వైఎస్ఆర్ పెన్షన్ ను మూడువేలకు పెంచాం.
    66.35లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం.
    పెన్షన్లకు ఐదేళ్లలో 84,731కోట్లు ఖర్చు చేశాం.
    9260 వాహనాల ద్వారా ఇంటికే రేషన్ పంపిణీ.
    వైఎస్ఆర్ బీమా కింద రూ. 650 కోట్లు ఖర్చు.
    ఈబీసీ నేస్తం కింద రూ. 1257కోట్లు పంపిణీ.
    కల్యాణ్ మస్తు, షాదీ తోఫా కింద రూ. 350కోట్లు పంపిణీ.
    కాపునేస్తం కింద రూ. 39,247 కోట్లు పంపిణీ.
    నేతన్న నేస్తం కింద రూ. 983 కోట్లు.
    జగనన్న తోడు కింద రూ. 3374 కోట్లు.
    జగనన్న చేదోడు కింద రూ. 1268 కోట్లు.
    వాహన మిత్ర కింద రూ. 1305 కోట్లు.
    బీసీ సంక్షేమం కోసం రూ. 71,170 కోట్లు ఖర్చు.
    బీసీలకు 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు.

బడ్జెట్ ఫుల్ డిటైల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు