Somu Veerraju : 2024 తర్వాత రాజకీయాల్లో ఉండను.. సోము వీర్రాజు సంచలన ప్రకటన

ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా  ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....దేశంలోని 18 రాష్ట్రాల్లో ప్

Somu Veerraju :  ఏపీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా  ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈరోజు విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….దేశంలోని 18 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పాలిస్తున్నాము… వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  ఏపీలో అధికారం ఇవ్వమని అడుగుతున్నామని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

2024 తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని… ఏనాడు తాను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పారు. గడచిన 42 సంవత్సరాలుగా బీజేపీ అనుబంధ సంస్ధలతో కలిసి పని చేస్తున్నానని బీజేపీకే పాలించే సత్తా ఉంది కాబట్టి అధికారం ఇవ్వమని కోరుతున్నానని ఆయన అన్నారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరుతున్నారని ఢిల్లీలో వైసీపీ ఎంపీలు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. బ్యాంకులను మోసం చేసిన నాయకుడిని బీజేపీలోకి చేర్చుకుంటారా అని వైసీపీ  నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను  ఆయన ఖండించారు. ఈ రోజే రఘురామ అవినీతి గుర్తుకు వచ్చిందా ?  మీ పార్టీలో టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Also Read :Etela jamuna : మెదక్ కలెక్టర్‌పై ఈటల రాజేందర్ భార్య జమున ఆగ్రహం..

ఏపీలో సమగ్రమైన నీటి ప్రాజెక్టుల కోసం ప్రణాళిక బధ్ధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11వేల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి ఇచ్చిందని.. మీరు కట్టండి.. మేము డబ్బులు ఇస్తాం… లేదంటే పోలవరం మాకివ్వండి మేము కట్టిస్తామని చెప్పారు.  పాల డైరీలు,స్పిన్నింగ్ మిల్లులు లాంటి కర్మాగారాలకు ప్రోత్సాహకాలు ప్రకటించి మూతపడకుండ ఆపలేకపోయారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేట్ పరం చేస్తున్నారు… మీరు ఆపండి అని వైసీపీ నాయకులు అంటారు…. సీఎం సొంత జిల్లాలోనే సుగర్ ఫ్యాక్టరీని మూసేశారు… మీ ప్రభుత్య పాలనలో చేసిన తప్పులు పెట్టుకుని మాపై నిందలు వేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు