Daggubati Purandeswari
Daggubati Purandeswari : విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సిద్దార్థ్ నాథ్ సింగ్, అరవింద్ మినాన్ లతో పాటు పలువురు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యుల సంఖ్య భారీగా పెరగాలని అన్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది.. గౌరవ ప్రదమైన సంఖ్యకు చేరుకోవాలి. కార్యకర్తలు యాక్టీవ్ గా ఉండాలని పురంధరేశ్వరి సూచించారు. ప్రస్తుతం 12లక్షలకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేరుకుంది. అనుకున్న విధంగా సభ్యత్వ నమోదు జరగడం లేదని, మందకొడిగా జరుగుతుందని అన్నారు.
Also Read: Pawan Kalyan: వైఎస్ జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో.. కూటమి శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచన
కార్యకర్తలు, నాయకులు ప్రజల దగ్గరకి వెళ్లడం లేదనే భావన ఉంది. అందరూ ప్రజల్లో వెళ్లి బీజేపీ చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలని పురంధేశ్వరి సూచించారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా ఐదో స్థానంలో ఉంది. కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు. రివర్స్ టెండరింగ్ తో వెనక్కి వెళ్లిన పోలవరాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్తుందని, అమరావతి నిర్మాణంకోసం 15 వేల కోట్లు ఆర్ధిక సహాయం ఇస్తున్నామని పురంధేశ్వరి అన్నారు. గత ఐదేళ్లు ఇసుక, మద్యం, భూ మాఫియాను నడిపారని, రోడ్ల దుస్థితికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆమె విమర్శించారు. కనీసం ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోయారు. వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరిగిందో జగన్ చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులు దారి మళ్లించారు. వైసీపీ పాలనలో మద్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇసుక మాఫియాపై విచారణ జరుగుతుందని పురంధేశ్వరి అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పురంధరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్లీట్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు.. కేంద్రం లాభాల్లోకి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ లో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే లాభాల్లోకి తీసుకుని వచ్చే చర్యలు తీసుకుంటున్నాం..ప్రైవేటీకరణ అంటున్నారే తప్ప అక్కడ జరుగుతున్నది అర్థం చేసుకోవడం లేదు. రాజకీయ లబ్ధికోసం ప్రైవేటీకరణ చేసేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని పురంధరేశ్వరి అన్నారు.