టీడీపీ, వైసీపీలకు సోము సవాల్ : ఏపీలో బీసీని సీఎంని చేసే సత్తా మీకుందా?

somu veerrajau challenge : అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకీ, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సవాలు విసిరారు. ఏపీలో బీసీ అభ్యర్ధిని సీఎం చేస్తామని స్పష్టం చేసిన సోము వీర్రాజు బీసీని సీఎం చేసే దమ్ముందా మీకుందా? అంటూ టీడీపీ, వైసీపీలకు ఆయన సవాల్ విసిరారు.

గురువారం (జనవరి 4) మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బీసీ అభ్యర్ధిని సీఎం చేసే సత్తా టీడీపీ, వైసీపీకి …టీడీపీ, వైసీపీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలంతా బీజేపీలోనే ఉన్నారని వారికి న్యాయం చేస్తామని బీసీలను సీఎం చేస్తామని ప్రకటించారు.

ఏపీపై పట్టు సాధించేందుకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రాజకీయ ఎత్తుగడల్లో పదును పెంచారు. దీంట్లో భాగంగా మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీ పుంజుకుంటోందని అందుకే వైసీపీ, టీడీపీ నేతలు నిరంతరం తమతో టచ్ లో ఉంటున్నారని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ వరకు వైసీపీ, టీడీపీ నేతలు తమతో చర్చలు జరుపుతున్నారని, బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే ఏపీ బీజేపీలోకి వలసలు ఊపందుకుంటాయని అన్నారు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా సోము వీర్రాజు వైసీపీ, టీడీపీలకు సవాల్ విసురుతూ..తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని, బీసీని సీఎం చేసే సత్తా వైసీపీ, టీడీపీలకు ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో బీసీలు బీజేపీతో ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలన్నది బీజేపీ అజెండా అని సోము వీర్రాజు అన్నారు.