Somu Veerraju
Somu Veerraju : సీఎం జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై సీఎం జగన్ మాట తప్పారని విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ మడమ తిప్పారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
సినీ పరిశ్రమను మట్టుబెట్టేలా ప్రభుత్వం వ్వవహరిస్తోందని ఆరోపించారు. సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. రాష్ట్రంలో చీప్ లిక్కర్ రూ.75లకే అమ్మాలని డిమాండ్ చేశారు.
Telangana Omicron : సిరిసిల్ల జిల్లాలో మూడు ఒమిక్రాన్ కేసులు..టిమ్స్ ఆసుపత్రికి తరలింపు
2024లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని జోస్యం చెప్పారు. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చాక తామే రూ.75లకు చీప్ లిక్కర్ అమ్ముతామని స్పష్టం చేశారు. రేపు ప్రజాగ్రహ సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు.