AP buses from the borders of Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. అయితే పండుగ సందర్భంగా ప్రయాణికులు సౌలభ్యం కోసం రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సులు నడిపేందుకు ఏసీఎస్ ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు.
దసరా పండుగ సందర్భంగా..తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ జోన్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపనుంది.
హైదరాబాద్ – గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు వచ్చే వారికి షటిల్ సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. గరికపాడు, కల్లూరు, తిరువూరు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ సరిహద్దుల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. 100 బస్సులు ప్రతీ చెక్ పోస్టు వరకు వెళ్లేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
https://10tv.in/no-rtc-bus-between-ap-and-telangana/
రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగబోవని ఏపీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ఒప్పందం పక్కన పెట్టి..పండుగకు సర్వీసులు తిప్పాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కానీ..అక్కడి ప్రభుత్వం అంగీకరించలేదని, పండుగ వరకైనా..200 బస్సులైనా తిప్పుదామని అన్నా..ఒప్పుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏపీ ప్రజలు సరిహద్దుల వరకు రాగగలిగితే..సొంతూళ్లకు చేరుస్తామన్నారు.