ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏపీఐఐసీకి 615 ఎకరాల కేటాయింపునకు గ్రీన్‌సిగల్న్
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- Harishth Thanniru
- Published On : May 20, 2025 / 01:59 PM IST
CM Chandrababu Naidu
AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ లో నిర్ణయించారు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలు..
♦ సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు.
♦ కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయింపు.
♦ ఎకరాకు రూ. 5 లక్షల చొప్పున భూ కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం.
♦ 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం.
♦ హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
♦ ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి.
♦ అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
♦ ఎండీయూ వాహనాలను రద్దు చేసి.. రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ లో చర్చ.
♦ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ అమోదం.
♦ ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
♦ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం.
♦ రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్
