AP Cabinet : ఏపీ క్యాబినెట్ అత్యవసర సమావేశం.. ఏఏ అంశాలపై చర్చిస్తారంటే..

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో..

AP Cabinet Meeting (File Photo)

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ భేటీ ప్రారంభమవుతుంది. మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. తాజాగా స్వల్ప వ్యవధిలోనే మరోసారి మంత్రివర్గ భేటీ జరగనుండటంతో ఏఏ అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ అనంతరం జరుగుతున్న మంత్రి వర్గ భేటీ కావడంతో.. పోలవరం, అమరావతి రాజధాని, ఇతర విషయాలపై  కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

Also Read : Chandrababu : సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదలకు..

లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు రంగాలకు కేటాయింపులు దక్కాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరానికి 15వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామని, విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు. ఇవేకాక.. పలు రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు మంజూరు కానున్నాయి.

Also Read : వైసీపీకి షాక్ తప్పదా? పార్టీని వీడే ఆలోచనలో ఉన్న ఆ ఇద్దరు కీలక నేతలు?

చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు జరిగే కేబినెట్ భేటీలో పోలవరం ప్రాజెక్ట్ విషయంపై కీలకంగా చర్చజరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్ర, శనివారాల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ లో భేటీలో చర్చించే అవకాశం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు