Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లాకే ఏపీ కేబినెట్ ఆమోదం

కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది.

Konaseema District : కోనసీమ జిల్లాకు డాక్టర్. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఈ అంశంలో ఎవరికైనా ఎట్టి అభ్యంతరాలున్నా నెల రోజుల లోపల తెలపాలని గడువు పెట్టింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని గత నెల 24 న అమలాపురం లో ఆందోళనకారులు చేసిన విధ్వంసంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లతో పాటు కొన్ని బస్సులు దహనం అయ్యాయి.

అల్లర్లలో పాల్గోన్న 258 మందిని పోలీసులు గుర్తించి 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. మిగిలిన వారిని పట్టుకోటానికి ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి. కోనసీమ అల్లర్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటికీ 144 సెక్షన్, 30వ సెక్షన్ అమలులో ఉన్నాయి.

కాగా…. గతనెల 24 నుంచి 15 రోజుల పాటు 16 మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. జిల్లా పేరు మార్పు అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. 13 వేల మందితో జిల్లా వ్యాప్తంగా గస్తీ నిర్వహిస్తోంది.

కోనసీమకు ఇప్పుడున్న పేరే కొనసాగించాలని కోరుతూ… ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 12 పిటీషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటీషన్లపై    హైకోర్టు ఒకే సారి విచారణ చేపట్టనుంది.

Also  Read : Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు 

ట్రెండింగ్ వార్తలు