ఏపీ రాజధాని అమరాతి ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానని ‘మనోధైర్య యాత్ర’ పేరుతో పర్యటిస్తానని ఎంపీ రఘురామ కృష్టంరాజు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే నినాదంతో ఉద్యమాలు చేస్తూ..మరణించివారి కుటుంబాలను సందర్శిస్తానని తెలిపారు. అమరావతి కోసం ఉద్యమాలుచేసే వారిని..మహిళల్ని కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ లు పెడుతున్నారని..వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు చేసేవారిని కుక్కల్లా పోల్చటం చాలా దారుణమని ఆ కుక్కలే త్వరలో వేటకుక్కలుగా మారి వెంటపడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
అలాగే సీఎం జగన్ కు గుడి కడతామని ఓ ఎమ్మెల్యే అనటం దానికి భూమి పూజ కూడా చేయటం సరికాదని..జగన్ కు కడితే గుడి కాదు చర్చి కట్టాలని సూచించారు. జగన్ కు గుడి కడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు.అలాగే ఏపీ ప్రభుత్వం కరోనా బాధితులను వైద్య సేవలు అందించటంలో విఫలం అయ్యిందని విమర్శించారు. కాగా ఇటీవల కాలం నుంచి ఎంపీ రఘురామ కృష్టంరాజు స్వంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తుంటం వైసీపీకి తలనొప్పిగా మారింది.
ఈక్రమంలో తాను మాట్లాడుతున్న వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారనీ..వైసీపీ నేతల నుంచి నాకు ప్రమాదం ఉందని..నాకు భద్రత కల్పించాలంటూ చేసిన విన్నపాలను కేంద్రం స్పందించింది. దీంతో అతనికి కేంద్ర ప్రభుత్వం వై-కేటగిరీ భద్రతను కల్పించింది. వై-కేటగిరీ ప్రాసెస్ పూర్తై సెక్యూరిటీ అందుబాటులోకి వచ్చేందుకు పది రోజులు పడుతందని..ఆగస్టు 15 తరువాత కేంద్రబలగాలత భద్రత ఉంటుందని ఆయన తెలిపారు.