మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో చంద్రబాబు మాట్లాడారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టారని చెప్పారు. దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపారని తెలిపారు. అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంసపాలన అందించిందని, తవ్విక కొద్దీ తప్పులు, అప్పులే బటయపడుతున్నాయని చెప్పారు.
ఇద్దరు మహిళల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించానని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేశారని అన్నారు.
పింఛన్ల ద్వారా వితంతువులు, దివ్యాంగులకు అండగా ఉన్నామని చెప్పారు. పంటలకు నీళ్లు ఇస్తానని గతంలో వచ్చినప్పుడు హామీ ఇచ్చానని, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని గతంలో హామి ఇచ్చానని అన్నారు.
Chandrababu Naidu: వితంతు రుద్రమ్మకు ఇంటి వద్దే పింఛను అందించిన సీఎం చంద్రబాబు