TDP : ఆ రూ.27కోట్లు ఎక్కడివి? టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు.. ఏం జరగనుంది

CID Notices To TDP : ఓ పక్కన హైకోర్టులో వ్యవహారం నడుస్తుండగానే.. సీఐడీ వెంట వెంటనే రెండు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

CID Notices To TDP

టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపింది ఏపీ సీఐడీ. పార్టీ కార్యాలయంలో అశోక్ బాబును కలిసి నోటీసులు అందించారు సీఐడీ కానిస్టేబుల్. పార్టీ అకౌంట్ లోకి వచ్చిన రూ.27కోట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది. ఈ నెల 18న వివరాలతో ప్రతినిధిని సీఐడీ కార్యాలయానికి పంపాలని నోటీసుల్లో తెలిపింది. అయితే, సీఐడీ అధికారులు టీడీపీ అకౌంట్ వివరాల కోసం వేధిస్తున్నారని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది టీడీపీ.

టీడీపీ జనరల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేరుపై నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. పార్టీ అకౌంట్ లో 27 కోట్లకు సంబంధించిన వ్యవహారం గురించి పార్టీ ప్రతినిధి వచ్చి వివరించాలని, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి పార్టీ ప్రతినిధి లేదా అకౌంటెంట్ ఎవరైనా సరే వచ్చి ఆ వివరాలు అందజేయాలని నోటీసుల్లో కోరారు.

Also Read : సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఇప్పటికే దీనికి సంబంధించి రెండు నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. దీనిపై ఇంతకుముందే పార్టీ వివరణ కూడా ఇచ్చింది. స్కిల్ కేసుకు సంబంధించి రూ.27 కోట్లు టీడీపీ అకౌంట్ లోకి వెళ్లాయని, ఈ డబ్బంతా స్కిల్ స్కామ్ కు సంబంధించినదే అని కోర్టులో తెలిపింది సీఐడీ.

ఈ నేపథ్యంలో ఆ 27 కోట్లకు సంబంధించి టీడీపీ అకౌంట్స్ చెక్ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. ఓ పక్కన హైకోర్టులో వ్యవహారం నడుస్తుండగానే.. సీఐడీ వెంట వెంటనే రెండు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల 18న సీఐడీ కార్యాలయానికి వచ్చి వివరాలు అందజేయాలని అధికారులు తేల్చి చెప్పారు.

Also Read : హైదరాబాద్ లో ప్రధాని మోదీ ప్రసంగం నాకు నచ్చలేదు.. ఆయన మాటలకు బాధపడ్డా

ఈ ఉదయమే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఐడీ కానిస్టేబుల్.. ఎమ్మెల్సీ అశోక్ బాబుకు ఆ నోటీసులు అందజేశారు. సీఐడీ కార్యాలయానికి హాజరవుతారో లేదో అన్నది ఇప్పటివరకు టీడీపీ చెప్పలేదు. మరోవైపు ఆ డబ్బు ఎలక్ట్రో బాండ్స్ కు సంబంధించిన వ్యవహారం అని, వాటి వివరాలు సీఐడీ అధికారులకు ఇవ్వడం చట్ట వ్యతిరేకం అని కూడా టీడీపీ వాదిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు