TDP Leader Ayyanna Patrudu Arrest: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్.. నర్సీపట్నం‌లో భారీగా పోలీసుల మోహరింపు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, అతని చిన్న కుమారుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తెల్లవారు జామున నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ నేడు నర్సీపట్నం బంద్ కు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TDP Leader Ayyanna Patrudu Arrest: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ సి‌ఆర్‌పి‌సి 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి పోలీసులు అయ్యన్నపాత్రుడు, అతను చిన్న కుమారుడిని అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చిన వివాదంలో అయ్యన్న పాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో వీరిద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.

Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నర్సీపట్నంలో గురువారం తెల్లవారు జామున అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. గోడదూకి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన చిన్నకుమారుడు చింతకాయల రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు అయ్యన్న పాత్రుడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు, అతని కుమారుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అయ్యన్న పాత్రుడు అరెస్టుకు నిరసనగా నర్సీపట్నం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం వద్ద భారీగా పోలీసులు బలగాలను మోహరించారు.

TDP Leader Ayyanna Patrudu Arrest

అయ్యన్న పాత్రుడు అరెస్టుపై అతని భార్య పద్మావతి స్పందించారు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో దొంగల్లా పోలీసులు గోడ దూకి వచ్చారని, తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. మా చిన్న కుమారుడు రాజేష్ తలుపులు తీసి ఏం కావాలని అడిగారని, సమాధానం చెప్పకుండా రాజేష్‌ను స్వామి మాలలో ఉన్నారని కూడా చూడకుండా ఈడ్చుకుని వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులు తాగి వచ్చి దుర్భాషలాడారని, అయ్యన్నపాత్రుడు కూడా వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఎఫ్ఐఆర్ కాపీ అడిగారని, ఎస్ఐఆర్ కాపీ కూడా చూపించకుండా నోటీస్ ఇచ్చి అరెస్టు చేశారని అన్నారు. ఇదేమన్నా బ్రిటిష్ పాలన.. ఇలాంటి పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి రాకూడదని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నుండి నా కొడుకు రాజేష్ కు, భర్త అయ్యన పాత్రుడికి ప్రాణహాని ఉందని అన్నారు.

TDP Leader Ayyanna Patrudu Arrest1

ట్రెండింగ్ వార్తలు