Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ అధికారులకు సూచించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు వాయిదా వేసింది.

Ayyanna Patrudu: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసేందుకు ఆదివారం తెల్లవారు జామున అధికారులు ప్రయత్నించారు. రెండు పొక్లెయిన్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇంటివెనుక ప్రహరీ గోడను కూల్చివేయడం ప్రారంభించారు. టీడీపీ కేడర్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని నిరసన తెలపడంతో కూల్చివేతను అధికారులు నిలిపివేశారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు రాజేష్ రెండు సెంట్లను ఆక్రమించి నిర్మాణం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Minister Taneti Vanitha: అయ్యన్నపాత్రుడుకు మంత్రి తానేటి వనిత సలహా
తమ ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిలిపివేయాలంటూ హైకోర్టులో హౌస్ మోహసన్ పిటీషన్ దాఖలు చేశారు ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమే అయ్యన్నపాత్రుడు ఇంటి నిర్మాణం చేయడం జరిగిందని, తహసీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పిటీషనర్ల తరపు లాయర్ తన వాదనను వినిపించారు. రాజకీయ కక్షతో, నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి కూల్చివేతలు నిర్వహించేందుకు అధికారులు పూనుకున్నారని కోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటికే కొంతభాగం కూల్చివేత జరిగిందని రెవెన్యూశాఖ తరపున ప్రభుత్వ లాయర్ చెప్పారు. అలాగే పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు.
Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
వాదనలను పరిగణలోకి తీసుకున్న జడ్జి.. అర్థరాత్రి కూల్చివేతలేంటని అధికారులను ప్రశ్నించారు. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలు ఉండగా ఇదేం పద్దతి అని అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు హైకోర్టు వాయిదా వేసింది.
- Extramarital Affair: మహిళ వివాహేతర సంబంధం.. భర్తకు తెలియకుండా ప్లాన్.. వదలని పోలీసులు..
- AP Politics: ట్వీట్లతో హీటెక్కుతున్న ఏపీ రాజకీయం
- Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్
- AP High Court : కోనసీమ అల్లర్ల పిటిషన్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50లక్షలు ఫైన్ వేస్తామని వార్నింగ్
1IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు సాధించే దిశగా భారత్.. 200 దాటిన ఆధిక్యం
2Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
3Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
4Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Pakistan Bus Accident : ఘోర బస్సు ప్రమాదం.. 19మంది మృతి
6Telangana: 10 సభలు పెట్టినా బీజేపీని ఎవరూ నమ్మరు: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
7Rains In Telangana : రాగల 24 గంటల్లో అల్పపీడనం-తెలంగాణలో పలు జిల్లాలలో వర్షాలు
8Gold Theft : కేజీన్నర బంగారం చోరీని చేధించిన పోలీసులు
9Texas shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
10PM Modi Bhimavaram Tour : రేపు భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు