Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

ఉత్తర‌ప్రదేశ్‌లోని అలీఘర్ వద్ద భారీ వర్షం కురవడంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఇదే సమయంలో స్కూటర్ పై ఓ జంట వెళ్తుంది. వరద నీటిలో నుంచి బైక్ ను వేగంగా నడిపే ప్రయత్నం చేయడంతో మ్యాన్ హోల్ లో ఇద్దరు పడిపోయారు. వెంటనే తేరుకొని మ్యాన్ హోల్ నుంచి బయటకు లేచారు. స్థానికులు గమనించి వారిని మ్యాన్ హోల్ నుంచి బయటకు లాగారు.

Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్

Couples

Viral Video: వర్షాకాలం వచ్చిందంటే వాహనదారులు కొంచెం జాగ్రత్తపడాల్సిందే. వర్షం వచ్చిన సమయంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియని పరిస్థితి. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తున్న సమయంలో మ్యాన్ హోల్ గుర్తించక పలువురు అందులో పడి ప్రాణాలు కోల్పోతుంటారు. పలువురు స్వల్ప గాయాలతో.. బతికించావు దేవుడా.. అనుకుంటూ బయటపడతారు. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ జంట బైక్ పై వెళ్తూ మ్యాన్ హోల్‌లో పడిపోయారు. అదృష్టవ శాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: కుక్కపిల్ల తిరిగినట్లు వీధుల్లో తిరిగిన పులి.. వణికిపోయిన స్థానికులు.. ఓ వ్యక్తి వచ్చి..

రుతుపవనాలు ఉత్తర‌ప్రదేశ్‌కు చేరుకున్నాయి. దీంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలీఘర్ వద్ద భారీ వర్షం కురవడంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఇదే సమయంలో స్కూటర్ పై ఓ జంట వెళ్తుంది. వరద నీటిలో నుంచి బైక్ ను వేగంగా నడిపే ప్రయత్నం చేయడంతో అక్కడే మ్యాన్ హోల్ లో ఇద్దరు పడిపోయారు. వెంటనే తేరుకొని మ్యాన్ హోల్ నుంచి బయటకు లేచారు. స్థానికులు గమనించి వారిని మ్యాన్ హోల్ నుంచి బయటకు లాగారు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ మాత్రం మ్యాన్ హోల్ లోనే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది.

Crude oil prices: ఇంధన ధరలు మళ్లీ పెరుగుతాయా? ప్రైవేట్ ఇంధన కంపెనీలు కేంద్రానికి ఏమని లేఖ రాశాయి..

ఈ వీడియో చూసినవారంతా అయ్య బాబోయ్.. బతికిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వర్షాకాలంలో వాహనాలపై జాగ్రత్తగా ప్రయాణించాలంటూ సూచనలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే స్కూటర్‌లో ప్రయాణించేది ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారి, అతని భార్య అని స్థానికులు తెలిపారు. వారు వైద్యుల వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.