CM Chandrababu Naidu
పోలవరంలో అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమీక్ష ముగిసింది. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ లా చేస్తామని అన్నారు.
గత ప్రభుత్వం రివర్స్ టెండర్లకు వెళ్లడం, ఈ విరామం వల్ల వరదల్లో తీవ్ర నష్టం వచ్చిందని తెలిపారు. అసమర్థత, అవినీతి, కుట్ర వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిని, గ్యాప్ 1, గ్యాప్ 2 లలో నష్టానికి కారణమయ్యారని తెలిపారు.
“గత ప్రభుత్వం ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు లో 3.84 శాతం మాత్రమే పని చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతానికి 76.79 శాతం పూర్తయింది. 41.25 తొలి కాంటూరు పరిధి పనుల కోసం రూ.12,157 కోట్లు కేంద్రం అంగీకరించింది. ఇటీవల రూ. 2,345 కోట్లు పోలవరానికి కేంద్రం విడుదల చేసింది అన్ని పనులు మొదలుపెట్టి, వేగవంతం చేస్తున్నాం.
కొత్త డి.వాల్, ఈ.సి.ఆర్.ఎఫ్.డ్యాం లను సమాంతరంగా నిర్మించేలా చూస్తాం. జనవరి 2 న కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. 2025 డిసెంబర్ కు డి.వాల్ పూర్తి చేయాలని ఆదేశించాము. 2026 ఫిబ్రవరిలో ఈ.సి.ఆర్.ఎఫ్ డ్యాం పనులు ప్రారంభిస్తామని ఇంజనీర్లు చెప్పారు. 2026 జూన్ కల్లా అప్రోచ్ చానల్, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ 2027 మే లోపు పూర్తి అవుతాయి.
ట్విన్ టన్నెల్స్, ఇతర అన్ని పనులు షెడ్యూల్ రూపొందించాం. 16,450 ఎకరాలు భూ సేకరణను ఏప్రిల్ 2025 కు పూర్తి చేసేలా అదేశించాం. జరిగిన నష్టాన్ని పూడ్చడానికి వైబ్రో కంపాక్షన్ పనులు చేయిస్తున్నాం. రూ.2,400 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది. కొత్త డయా ఫ్రమ్ వాల్ రూ.400 కోట్ల నుండి రూ.960 కోట్ల వ్యయం కు పెరిగింది.
రూ.836 కోట్లు వైభ్రో కాంపక్షన్, రూ.363 కోట్లు సాండ్ ఫిల్లింగ్, రూ.211 కోట్లు డీ వాటరింగ్ కు ఖర్చు అవుతుంది. యెట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించాము. 2027 లోపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు తెలుగదేశం ప్రభుత్వం 2019 లో అధికారంలోకి వచ్చి ఉంటే 2021 కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది. పట్టిసీమ లేకుంటే రాష్ట్రం లో అనేక ఇబ్బందులు ఉండేవి, పట్టిసీమ వృధా అన్నారు, ఇప్పుడు అదే దిక్కయింది” అని చంద్రబాబు తెలిపారు.