Cm Chandrababu : ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం కోసం నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు.
వైసీపీ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోదీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు చంద్రబాబు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాల బాధ్యతలను తాము తీసుకుంటామని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు ఇస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నిధులను త్వరగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరనున్నారు.
Also Read : టీడీపీతో టచ్‌లోకి వస్తున్న వైసీపీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు